మంగళగిరి: జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర డిజిపి ను మర్యాదపూర్వకంగా కలిసిన వకుల్ జిందాల్
గుంటూరు జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. గుంటూరు జిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అనేక సవాళ్లతో కూడిన జిల్లాల్లో ఒకటని డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, జనాభా విస్తీర్ణం, ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కు డిజిపి సూచించారు. గుంటూరు జిల్లా ఎస్పీగా నియమితులైన సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ కు డిజిపి హరీష్ కుమార్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు.