భూత్పూర్: పాత మొల్గరలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి
దేవరకద్ర నియోజకవర్గం భూత్ పూర్ మండలం పాత మొల్గరలో మంగళవారం మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఆయా గ్రామాలపై నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.