ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆ పధక అమలు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Oct 21, 2025
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆ పధక అమలు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ సమావేశం - 2025 - 26 జరిగింది. వివిధ శాఖలకు ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ నిధులను ప్రభుత్వం కేటాయించిన తీరు, జిల్లాస్థాయిలో ఆయా శాఖలవారీగా ఖర్చుపెట్టిన విధానాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మా నాయక్ ఈ సందర్భంగా కలెక్టరుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కొన్ని శాఖలు లక్ష్యాలకు దూరంగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల అభివృద్ధి, వారి ఆవాస ప్రాంతాలలో మౌలిక సదుపాయ