పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు : పట్టణ సీఐ నారాయణరెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రధాన రహదారులపై ఎక్కడబడితే అక్కడ వాహనాలను నిలపడం, అలాగే దుకాణ యజమానులు తమ వ్యాపారానికి సంబంధించిన బోర్డులను రోడ్డుపై పెట్టి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలియజేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో దుకాణ యజమానులకు పలు సూచనలు చేశారు.