గాజువాక: 71 వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్
జీవీఎంసీ 71 వ వార్డు శ్రీ రామ్ నగర్ మరియు సమైక్య అపార్ట్మెంట్ ఏరియాలో కుల అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. స్థానిక వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం మరియు సంపద సృష్టించడం టిడిపి పార్టీకి తెలుసు అని అందుకనే సరవేగంగా అభివృద్ధి చేయగలుగుతున్నామని గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరగలేదని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సుమారు 75 లక్షల వ్యయంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.