బీటలు వారిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నాగలాపురంలో మండల స్థాయి విద్యుత్ వినియోగదారుల విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి రెవెన్యూ కార్యాలయం ఉంది. ఈ భవనం పూర్తిగా బీటలు వారి చినుకు పడితే కార్యాలయంలోని రికార్డులు తడిసి పాడైపోతున్నాయి. ప్రస్తుతం అధికారులు అద్దె భవనంలో కార్యాలయాన్ని నడుపుతున్నారు. విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రం కోసం నూతన భవనాన్ని నిర్మించాలని వినియోగదారులు కోరుతున్నారు.