రాయదుర్గం: సేవా పక్వాడా కార్యక్రమాలు విజయవంతం చేయండి : పట్టణంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డి
భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజులపాటు చేపట్టే వివిధ సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ సేవా పక్వాడా పేరుతో ఆరోగ్య, రక్తదాన శిబిరాలు, దేశం కోసం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.