పదవులు అలంకరణ కాకూడదని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకులకు సూచించారు. గురువారం టిడిపి కార్యాలయంలో మండల కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాతిక సంవత్సరాల తర్వాత టిడిపి గిద్దలూరు గెలిచేందుకు ఇప్పుడు ఎన్నుకున్న అధ్యక్షులు ఎంతో కృషి చేశారని భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా నాయకులు వ్యవహరించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకులకు సూచించారు.