సంగారెడ్డి: ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది: సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణ రాష్ట్రం ఎందరో త్యాగదనుల ఫలితంగా ఏర్పడిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను గుర్తుచేస్తూ, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక చొరవతో తెలంగాణకు విముక్తి లభించిందని పేర్కొన్నారు.