ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద 42 శాతం రిజర్వేషన్లపై వివిధ సంఘాలకు చెందిన నేతలు దీక్ష నిర్వహించారు. రిజర్వేషన్ల సాధన కోసం ప్రతి జిల్లాలో ఉద్యమం చేస్తామని వారందరూ ఏకతాటిపైకి వచ్చినట్లు తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొని, వారి దీక్షను విరమింప చేశారు. రాబోయే రోజుల్లో దీన్ని ఉద్యమంగా మలచాలని వారికి సూచించారు.