నారాయణ్‌ఖేడ్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం సిగ్గుచేటు: నారాయణఖేడ్‌లో బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించకపోవడం సిగ్గుచేటని బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మండిపడ్డారు. నారాయణఖేడ్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని విమర్శించారు. బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.