16వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని మున్సిపల్ పరిధిలో గల 16వ వార్డులు సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. సాధారణ నిధులతో 16.80 లక్షల వ్యయంతో నాగిరెడ్డిపల్లి పరిధిలో రోడ్డు నిర్మిస్తున్నట్టుగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధిని అందిస్తున్నామని తెలియజేశారు.