ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రకటించిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను ముఖ్యమంత్రి తెలుసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు.