ఇటిక్యాల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఢీకొన్న లారీ
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇటిక్యాల బస్ స్టాప్ వద్ద ఆగి ఉండగా వెనుక వైపు నుంచి లారీ ఢీ కొట్టింది. అయితే అదే సమయంలో బస్సు ముందుకు కదలడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.