కొత్తగూడెం: కొత్తగూడ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తునికాకు రైతుల గురించి మాట్లాడారు
కొత్తగూడ మండల కేంద్రంలో తుడుందెబ్బ నాయకులు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక సాయం గా ఉపయోగపడే పంటగా తునికి ఆకు సేకరణ పై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండాకాలం లో గిరిజన, గిరిజనేతర ప్రజలకు నెల రోజుల పాటు తనికి సేకరణ ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతుందని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర్ఖ యాదగిరి అన్నారు. ఆదివాసీలు, గిరిజనేతరులు కూడా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి అడవికి వెళ్లి చెట్టు చెట్టు, గుట్ట గుట్టలు తిరుగుతూ తునికి కు సేకరిస్తుంటారు.