సత్తెనపల్లి పట్టణంలో ఘనంగా కోడెల వర్ధంతి కార్యక్రమం
సత్తెనపల్లి తాలూకా సెంటర్ వద్ద డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆరవ వర్ధంతిని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరాం హాజరయ్యారు. కోడెల నరసరావుపేట సత్తనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారంటూ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు కోడెల అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్త ఇతరులు పాల్గొన్నారు.