ఆలూరు: ఆస్పరిలో రైల్వే స్టేషన్ దగ్గర ఈనెల 31న గూడ్స్ రైలు కింద ఆత్మహత్య చేసుకున్న వారిద్దరూ దంపతులే : రైల్వే ఎస్ ఐ గోపాల్
Alur, Kurnool | Nov 2, 2025 రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని ఆస్పరి నగరూరు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు కింద పడి విబో శంకరన్, నాగలక్ష్మి అనే వృద్ధులు ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. కాగా.. వీరిద్దరూ భార్యభర్తలని రైల్వే పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం ఎస్సై మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం మధు రైకు చెందిన విబో శంకరన్, నాగలక్ష్మి దంపతులకు అరుణ్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. విబో శంకరన్ దంప తులు మొదటి నుంచి తాము ఎవరికి భారం కాబోమని అంటుండేవారని.. ఈ క్రమంలోనే గత నెల 27న తన ఫోన్ రిపేరుకు ఇస్తున్నానని శంకరన్ తన కుమారుడికి మెసేజ్ పంపించారన్నారు. అప్పటి నుంచి తన తండ్రి నుంచి ఫోన్ రాలేదని అన్నారు.