తాడికొండ: నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: సుచరిత
నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: సుచరిత తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేస్తున్నానని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. 22వ తేదీ సోమవారం ఉదయం 9:00 గంటలకు నవభారత్ నగర్ 4వ లైన్లోని తన నివాసం నుంచి తాడికొండ తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.