తాడిపత్రి: ప్రశాంతంగా ఉన్న వెంకటం పల్లిలో కొందరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆ గ్రామానికి చెందిన సుంకన్న
ప్రశాంతంగా ఉన్న జి.వెంకటాం పల్లి గ్రామంలో చిచ్చు పెట్టద్దు అంటూ ఆ గ్రామానికి చెందిన సుంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. యానిమేటర్ విషయంలో ఈ వెంకటం పల్లి గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మా మండలంలో ఎలాంటి గొడవలు జరగలేదని కేవలం కొద్ది మంది అధికార పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.