మంత్రి సవిత సమక్షంలో ఏడు వైసిపి కుటుంబాలు టీడీపీలోకి చేరిక
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామానికి చెందిన ఏడు వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి మంత్రి సవిత టీడీపీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.