కొత్తగూడెం: రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం దరఖాస్తుల ఆహ్వానం: సింగరేణి సిఎండి బలరాం
దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రతిబంధకాలు తొలగించాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుల సూచనలతో సింగరేణి కాలరీస్ రూపొందించిన రాజీవ్ గాంధీ సివిల్ అభ్యర్థుల హస్తం పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు సింగరేణి సిఎండి బలరాం శుక్రవారం సాయంత్రం 9 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.