గౌసియా నగర్లో మురికితో అవస్థలు వరదయ్యపాలెం మండలం గౌసియా నగర్ గ్రామంలో మురికి నీటితో అవస్థలు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సైడు కాలువలు లేక సిమెంటు రోడ్డుపై మురికి నీరు పారుతోందని చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా గ్రామ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాలువలు తవ్వించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.