కానూరు లో గంజాయి నిందితుల అరెస్ట్
Machilipatnam South, Krishna | Sep 25, 2025
పెనమలూరు నియోజకవర్గం కానూరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం ఉయ్యూరు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయాల సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.