సంగారెడ్డి: ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తు చేయాలి: జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్
పోలీసులు ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఈ మేరకు హత్నూర పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డిఎస్పి తో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు పోలీస్ స్టేషన్లో బ్యారక్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. స్టేషన్కు వచ్చే వారికి మర్యాదగా మాట్లాడాలని సూచించారు.