కర్నూలు: పెద్ద తుంబలం మండలంగా ప్రకటించాలంటూ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
పెద్ద తుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ వాసులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వారు — ఆదోని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేసి పెద్ద తుంబలాన్ని మండలంగా గుర్తించాలని కోరారు. ఎన్నో రోజులుగా పోరాడుతున్నా స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.