ఇబ్రహీంపట్నం: హఫిజ్ పేట డివిజన్ పరిధిలో పర్యటించి పలు సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ
హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని మురళీధర్ సొసైటీ కాలనీలో ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ అధికారులతో కలిసి కాలనీలో పలు సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లోపాలు రహదారుల దుస్థితి మురుగునీటి సమస్యలు వీధి దీపాల సమస్యలను పరిశీలించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.