అమరావతిలో కృష్ణా నదీ ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి
ఎగువ నుంచి అధికంగా వస్తున్న వరద నీటితో కృష్ణా నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. దీని కారణంగా పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు నదిలోకి దిగరాదని పోలీసులు హెచ్చరించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన టాప్ల వద్దే స్నానాలు చేయాలని సూచించారు. భక్తులు, ప్రజలు కృష్ణా నది పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని మంగళవారం పోలీసులు కోరారు.