కళ్యాణదుర్గం: లోకేష్, చంద్రబాబుకు డబ్బులు ఇచ్చి సురేంద్రబాబు ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నాడు: అనుంపల్లిలో మాజీ ఎంపీ తలారి రంగయ్య
నేను ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా సీటు తెచ్చుకున్నాను. ప్రస్తుత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే లోకేష్, చంద్రబాబుకు డబ్బులు ఇచ్చి సీటు తెచ్చుకున్నాడని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించారు. సెట్టూరు మండలం అనుంపల్లి గ్రామంలో బుధవారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు బెల్ట్ షాపులో పెట్టి మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నాడన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో మద్యం బెల్టు షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.