జనగాం: ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
ఈ నెల 17 న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా చేయాలిసిన ఏర్పాట్ల పైన మంగళవారం అదనపు కలెక్టర్ బెన్ష లోమ్ తో కలిసి సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేసారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరెట్ లో జరిగే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా ప్రభుత్వ విప్,MLA బీర్ల అయిలయ్య రానున్నారని తెలిపారు.కార్యక్రమ వివరాల గురించి అతిధి కి,అలాగే ప్రోటో్కాల్ ప్రకారం గా అందరికి ఇన్విటేషన్ ను అందించాలన్నారు.