మీ డబ్బు__ మీ హక్కు పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Oct 22, 2025
మీ డబ్బు-మీ హక్కు అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 నెలల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్లో "మీ డబ్బు-మీ హక్కు" అనే గోడ పత్రికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతోందన్నారు.