శాంతి భద్రతలకు కాపాడటంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా బాధ్యతలు నిర్వహిస్తానన్న ఎస్పీ సతీష్ కుమార్
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడడంలో మహిళలకు రక్షణ కల్పించడంలో సైబర్ నేరాలను అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం, గంజాయి రవాణా మరియు రౌడీయిజానికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. పోలీసుల సేవ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుతామన్నారు. జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయో గుర్తించి వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు కూడా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలన్నారు