కలకడలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ ఎమ్మెల్యే చింతల
పీలేరు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన కలకడలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రయివేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను చేపట్టిందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.ఈ మెడికల్ కాలేజీలను పేదలు మరియు మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనార్థం స్థాపించబడినట్లు తెలిపారు. జిల్లాల వారీగా, విద్య మరియు వై