మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. చిన్నారులు చాలీసా పఠనం చేసి దేవాలయాన్ని ఆధ్యాత్మికతతో నింపారు. గణపతి స్తోత్రం, నవగ్రహ స్తోత్రాలు ఏకకంఠంగా పారాయణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల్లో భక్తి భావన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు