పాణ్యం: కల్లూరు 35 వార్డ్ గోవర్ధన్ రైతు బజార్ కు ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు సిసి రోడ్డు వేయించాలని : సిపిఎం పార్టీ డిమాండ్
కర్నూలు నగర పాలక సంస్థ కల్లూరు 35 వ వార్డు గోవర్ధన్ నగర్ రైతు బజార్ కు ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు సిసి రోడ్డు వేయాలని CPM పార్టీ ప్రతినిధి బృందం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ చిన్న రాముడు గారిని కలిసి సోమవారం వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప మాట్లాడుతూ గోవర్ధన్ నగర్ రైతు బజార్ కు ఎదురుగా ఉన్న రోడ్డు మెయిన్ రోడ్డు గా ఉందని ఈ రోడ్డు గుండానే అనేక కాలనీల వాళ్ళు రోజు ప్రయాణం కొనసాగిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది....