ఆదోని డివిజన్ పరిధిలోని కోసిగి రైల్వే స్టేషన్ మధ్య శుక్రవారం రాత్రి రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు ఆదోని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సర్వేశ్వర్ తెలిపారు. మృతుడు యూపీ రాష్ట్రానికి చెందిన వాసిగా ఆధార్ కార్డు ద్వారా గుర్తించామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలింపు