ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు పేద, నిరుపేద వర్గాల్లోని వృద్ధులు, వితంతువు, వికలాంగులకు భరోసా ఇస్తున్నాయని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని 31వ వార్డ్ భాగ్య నగర్ కాలనీలో సోమవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, ఎమ్మెల్యే సోదరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు గుమ్మనూరు నారాయణస్వామిలు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ వార్డులో అర్హత కలిగిన లబ్ధిదారులకు 4వేలు, వికలాంగులకు 6వేలు, మంచానికి పరిమితమైన వారికి 15వేల రూపాయలు పింఛన్లను అందజేశారు.