తాకట్టు పెట్టిన బంగారం మాయం, నగరంలోని రాంనగర్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఎదుట లబ్ధిదారుల ఆందోళన
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
తాకట్టు పెట్టిన బంగారాన్ని నగరంలోని రాంనగర్ 80 ఫీట్ రోడ్డులో ఉన్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అధికారులు అధిక వడ్డీకి ప్రైవేటు ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టి తాము తీసుకున్న నగదుకు సంబంధించి మొత్తం డబ్బులు చెల్లించిన అనంతరం తమను మోసం చేశారంటూ లబ్ధిదారులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బ్యాంకు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బాధితులు మీడియాకు వివరాలను వెల్లడించారు.