అనపర్తి: అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నాసిరకం భోజనం వ్యవహారం పై ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదు- మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నాసిరకం భోజనం వ్యవహారంపై ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదంటూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో నాసిరకం భోజనం ఇస్తున్నారంటూ వార్త కథనాలు వచ్చిన నేపథ్యంలో టిడిపి నాయకులతో కలిసి గురువారం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆసుపత్రికి సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం భోజనం వ్యవహారంపై వైద్యాధికారులను ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో భోజనం వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై ఎందుకు ఎమ్మెల్యే నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు.