కుప్పం: పేదల సొంతింటి కల సహకారం: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
నిరుపేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. రామకుప్పం మండలంలోని కెంచనబల్ల గ్రామంలో సామూహిక గృహప్రవేశాలు బుధవారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇల్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం కోరారు.