టంగుటూరులో గురువారం జరిగిన హత్య ఘటన సంచలనంగా మారింది. ఇంటిలో నిద్రిస్తున్న రమణయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు ఉద్దేశపూర్వకంగా ప్లానింగ్ ప్రకారం గానే రమణయ్య ను హత్య చేశారని దోషులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని సీఐ హజరతయ్యా తెలిపారు. అయితే ఏ కోణంలో హత్య జరిగిందో అనే విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సవాలుగా మారింది.