రాయదుర్గం: పట్టణంలో వైసిపి నాయకుల పర్యటనను అడ్డుకున్న టిడిపి నాయకులు, ఇరువురి మద్య వాగ్వాదంతో ఉద్రిక్తత
రాయదుర్గం టౌన్ 31, 32 వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ శిల్ప, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, YCP కౌన్సిలర్లను TDP నాయకులు అడ్డగించడం ఉద్రిక్తతకు దారితీసింది. బాబు ష్యూరిటి మోసం గ్యారెంటీ పేరుతో ఇంటింటికి వెళుతున్న YCP నాయకులను TDP వార్డు ఇన్చార్జ్ లు బళేశంకర్, యల్లప్ప తదితరులు బాబు చేసిన మోసం ఏమిటని నిలదీశారు. దీనికి YCP నేతలు దీటుగా స్పందించారు. ఇరువురు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.