ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం లో 14 మంది విద్యార్థులు కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడటంపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి విచారణ వ్యక్తం చేశారు. గురువారం కలుషిత నీరు తాగిన విద్యార్థులు అనారోగ్యం బారిన పడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వారి ఆరోగ్య పరిస్థితిపై బాధ్యతలు తీసుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు మరో మారు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.