ఉదయగిరి: తెడ్డుపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ను ఢీకొన్న బోరు లారీ ముగ్గురు మృతి, మరో చిన్నారికి తీవ్ర గాయాలు
కలిగిరి మండలం, తెల్లపాడు రోడ్డు సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కలిగిరి నుంచి వస్తున్న బైక్ను ఎదురుగా వచ్చిన బోరు లారీ ఢీకొట్టింది. బైక్ మీద ప్రయాణిస్తున్న భార్యా భర్తలు, పెద్ద కుమార్తె అక్కడిక్కడే మృతిచెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ముగ్గురి మృతదేహాల మధ్య మోచేతి వరకు తెగిన చేయితో చిన్నారి విలపించడం అందర్నీ కంటతడి పెట్టించింది.