శ్రీశైలం మల్లన్న భక్తులకు ఫేక్ వెబ్సైటు కేటుగాళ్ల బెడద తప్పడం లేదు,గతంలో పలుమార్లు ఫేక్ వెబ్సైట్ల ద్వారా రూములను బుక్ చేసుకొని భక్తులు మోసపోయారు, తాజాగా కర్ణాటకకు చెందిన గురువరాజ్ అనే భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఫేక్ వెబ్ సైటు ద్వారా రూము బుక్ చేసుకొని, డబ్బులు మోసపోయాడు,మొదటగా 5821 మరల 5250 మొత్తం 11071 గురువరాజు మోసపోయాడు ,మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతుండడంతో ఇది ఫేక్ వెబ్ సైట్ అని గ్రహించిన గురువరాజ్ ,ఈ వెబ్ సైట్ పై దేవస్థానంలో ఫిర్యాదు చేశాడు, ఇది ఫేక్ వెబ్ సైట్ అని ఎవరు ఇలా మోసపోవద్దని ఈవో తెలియజేశారు,