దర్శి: తుఫాన్ బాధితులకు నిత్యవసర సరుకులు అందజేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి మండల పరిధిలో పునరావస కేంద్రంలో ఉన్న బాధితులకు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిత్యవసర సరుకులను అందజేశారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 57 కుటుంబాలకు పునరావస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి మౌలిక వసతులతో పాటు భోజనాలను ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్లు గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాపారావు పాల్గొన్నారు