కుప్పం: టీచరుగా మొదటి రోజు అనుభవం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది : నూతన టీచర్ సురేష్
ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా మొదటి రోజు అనుభవం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని కుప్పం మండలంలోని బొగ్గుపల్లి స్కూల్ టీచర్ సురేశ్ అన్నారు. కార్వేటినగరానికి చెందిన ఆయన ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ప్రతిభ చాటి టీచర్‌గా ఎంపికయ్యారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి టీచర్‌గా ఎంపికైనట్లు చెప్పారు. తల్లితండ్రులు తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని విజ్ఞప్తి చేశారు.