కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరు పట్టణంలో పాత బస్టాండ్ వద్ద బుధవారం జిల్లా అడిషనల్ ఎస్పి(అడ్మిన్) ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్.పి (AR) రమణయ్య ఆధ్వర్యంలో సివిల్, ఏఆర్ పోలీసులు మాబ్ ఆపరేషన్; మాక్ డ్రిల్ నిర్వహించారు. విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, జన సమూహాలను నియంత్రించి శాంతిభద్రతలను ఎలా నియంత్రించాలన్న వాటిపై మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సిబ్బంది వివరించారు.