అసిఫాబాద్: సిర్పూర్ యూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండలంలోని జామిని గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు. విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పన, విద్యా బోధన తీరు, హాజరు పట్టికలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. పాఠశాలలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు.