నా భద్రత గురించి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా గన్నవరంలో మీడియాతో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
తనకు భద్రత కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా DGP నీ అడిగితే ఇప్పుడు వరకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు గన్నవరం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న తనకు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం ఏటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అన్నారు