తాడేపల్లిగూడెం: బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి: డిప్యూటీ సీఎం కొట్టు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం రాత్రి 7 గంటలకు బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను గత ప్రభుత్వాలు కేవలం ఓటుబ్యాంక్ గా మాత్రమే వదుకున్నాయన్నారు. బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ 50శాతం పైగా పదవులు అందించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముప్పిడి సంపత్, వైసీపీ నాయకులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.